ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం

05-06-2026: ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా జేడీ ఫౌండేషన్, విశాఖపట్నం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం మరియు ప్రజల్లో పర్యావరణంపై అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

Y2K పార్క్‌లో మొక్కలు నాటే కార్యక్రమం

Y2K Park, చాణుక్య నగర్, సుజాతా నగర్ వద్ద ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పార్క్ ఆవరణలో బాదం, తురాయి, మహాగణి, సపోటా, కదంబం తదితర మొక్కలను నాటడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పెందుర్తి జోనల్ కమిషనర్ శ్రీ శంకరరావు గారు పాల్గొని పార్క్ ఆవరణలో మొక్కలు నాటారు. నాటిన మొక్కలను సంరక్షించేందుకు స్థానికులు వాటిని దత్తత తీసుకుని బాధ్యతగా చూసుకోవాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో Y2K Park సంఘం సభ్యులు, ఎస్.ఎస్. కృష్ణ గారు, హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన రేవతి గారు, సచివాలయ సిబ్బంది, జీవీఎంసీ ఇతర సిబ్బంది మరియు జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.

GICE కాలేజీలో మొక్కలు నాటడం మరియు పర్యావరణ పరిరక్షణ సదస్సు

కంచరపాలెం హైవేలోని గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ (GICE) కాలేజీ ఆవరణలో జీవీఎంసీ సమకూర్చిన మొక్కలను నాటడం జరిగింది. అనంతరం పర్యావరణ పరిరక్షణపై సదస్సు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో GICE ప్రిన్సిపాల్ శ్రీ కే.వి. రమణ గారు మాట్లాడుతూ, వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ కనీసం 10 మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతను చేపట్టాలని కోరారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న CEO & సెక్రటరీ, స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ శ్రీ విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం HPCL పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పర్యావరణ గతి విధి సంచాలకులు రంగాచార్యులు గారు, వనమాలి ఎం. సరిత గారు మరియు జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన మరియు పచ్చని వాతావరణాన్ని అందించవచ్చని జేడీ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader