08-07-2026: విజయనగరం జిల్లా సారిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జేడీ ఫౌండేషన్ విజయనగరం వారి సౌజన్యంతో పాఠశాల గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
విద్యార్థులకు మెరుగైన పఠన వాతావరణాన్ని కల్పించే ఉద్దేశంతో గ్రంథాలయానికి అవసరమైన ఫర్నీచర్, లాకర్లు, కుర్చీలు, చదువుకునే టేబుల్స్‌తో పాటు సుమారు 1,500 పుస్తకాలను జేడీ ఫౌండేషన్ అందించింది.
ఈ కార్యక్రమానికి 2-ఆంధ్రా గర్ల్స్ BN NCC కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ శ్రీ గోపేందర్ గారు విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి సందేశం అందించారు. విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవర్చుకుని, గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ గ్రంథాలయాన్ని విజయనగరం DEO శ్రీ మాణిక్యం నాయుడు గారు ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, పఠన సదుపాయాలు అందుబాటులోకి రావడం ద్వారా వారి విద్యాభ్యాసానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని జేడీ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జే.డీ. ఫౌండేషన్ అన్నవరప్పాడు శాఖను రైతులు బందెల సుబ్బయ్య, గుద్దటి రాము, కానూరి ఆంజనేయులు, కానూరి తాతారావు, బందెల ఆనంద్ గోపి కృష్ణ, ఆకుల సత్య సాయి బాబా, బందెల ఈశ్వరరావు తదితర గ్రామస్తులు అభినందించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లోకసత్తా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బీసెట్టి బాబ్జీ గారికి జేడీ ఫౌండేషన్ విజయనగరం సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడం, జ్ఞానాన్ని విస్తరించడం మరియు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తోడ్పడేలా పాఠశాలల్లో గ్రంథాలయాలను అందుబాటులోకి తీసుకురావడం జేడీ ఫౌండేషన్ చేపడుతున్న విద్యా కార్యక్రమాల్లో ముఖ్యమైన భాగమని సభ్యులు తెలిపారు.





