సింహాచలం గిరి ప్రదక్షిణలో భక్తులకు జేడీ ఫౌండేషన్ సభ్యుల సేవలు

28-07-2026: సామాజిక సేవలో భాగంగా శ్రీ సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులకు హెర్బల్ ఫుట్ మసాజ్ సేవలు అందించడం జరిగింది.

28-07-2026 సాయంత్రం 6:00 గంటల నుండి NAD వంటిల్లు సమీపంలోని SM Car Wash ప్రాంగణంలో గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్న భక్తులకు ప్రత్యేకంగా తయారు చేయించిన హెర్బల్ ఆయిల్‌తో ఫుట్ మసాజ్ చేయడం జరిగింది.

సింహాచలం గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో, ఎక్కువ దూరం నడవడం వల్ల కాళ్లు, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్న వేలాది మంది భక్తులకు జేడీ గ్రూప్ సభ్యులు ఎంతో ఓపికతో హెర్బల్ ఫుట్ మసాజ్ సేవలు అందించారు. భక్తులకు కొంత ఉపశమనం కలిగించేందుకు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

దీనితో పాటు గోపాలపట్నం, లక్ష్మీనగర్ వాస్తవ్యురాలు శ్రీమతి లక్ష్మీ గారు ఒళ్లు నొప్పులు, జ్వరంతో ఇబ్బంది పడుతున్న భక్తులకు ఉచితంగా మందులు అందించారు. భక్తులకు అవసరమైన సమయంలో సహాయం అందించడం ద్వారా సేవా కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహించడం జరిగింది.

జేడీ ఫౌండేషన్ సభ్యులు సాయంత్రం 6:00 గంటల నుంచి సుమారు అర్ధరాత్రి 1:00 గంటల వరకు ఓపికతో సేవలు అందిస్తూ భక్తులకు సహకరించారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులందరినీ జేడీ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారు ప్రత్యేకంగా అభినందించారు.

భక్తులకు అవసరమైన సమయంలో సేవ చేయడం, సామాజిక బాధ్యతను నిర్వర్తించడం మరియు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహించడం జేడీ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యాలలో భాగమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader