ఎస్.ఆర్. డిజి స్కూల్ విద్యార్థులతో విత్తన బంతుల తయారీ

25-07-2026: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మాజీ సీబీఐ జేడీ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారి సూచనతో ములగాడలోని ఎస్.ఆర్. డిజి హై స్కూల్ విద్యార్థులతో విత్తన బంతుల తయారీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సీతాఫలం, సపోటా, చింత, కుంకుడు, మద్ది, టాబోబియా, తురాయి, మహాగణి, సుబాబుల్, పెద్ద గురివింద, ఏనుగు బాదం, గంగరావి తదితర విత్తనాలను ఉపయోగించి విద్యార్థులతో విత్తన బంతులను తయారు చేయించడం జరిగింది.

ముందుగా విత్తన బంతుల ఆవశ్యకత, పర్యావరణ పరిరక్షణలో వాటి ప్రాముఖ్యత మరియు తయారు చేసే విధానం గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని స్వయంగా విత్తన బంతులను తయారు చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్.ఆర్. డిజి డీజీఎం శ్రీ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, విత్తన బంతులను కొండ ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలు వంటి ప్రదేశాల్లో వెదజల్లడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించవచ్చని తెలిపారు. విత్తన బంతుల కార్యక్రమాల ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించవచ్చని పేర్కొన్నారు.

విద్యార్థులను ఇలాంటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం ద్వారా వారిలో ప్రకృతి పట్ల అవగాహన, బాధ్యత మరియు సామాజిక స్పృహ పెంపొందుతుందని జేడీ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. భవిష్యత్ తరాలకు పచ్చని వాతావరణాన్ని అందించేందుకు మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీమతి అశ్వినీ గారు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీ శివ కుమార్ గారు, ఇతర పాఠశాల సిబ్బంది మరియు జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader