21-07-2026: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మాజీ సీబీఐ జేడీ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జెర్రిపోతులపాలెం గవర్నమెంట్ వన్ సెంట్ లే-అవుట్‌లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
జీవీఎంసీ సమకూర్చిన కానుగ, కదంబ, మహాగణి, టాబోబియా, సపోటా, నేరేడు, వేప, మామిడి, పనస తదితర మొక్కలను కాలనీ సభ్యులు మరియు జేడీ ఫౌండేషన్ సభ్యులు కలిసి నాటడం జరిగింది.
ఈ సందర్భంగా కాలనీ గౌరవ అధ్యక్షుడు శ్రీ బిహెచ్. రామారావు గారు మాట్లాడుతూ, కాలనీలో పచ్చదనం పెంపొందించేందుకు జేడీ ఫౌండేషన్ సహకారంతో నాటిన మొక్కలను కాలనీ వాసులు బాధ్యతగా సంరక్షించి, వాటిని పెంచాలని సూచించారు.
మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కాలనీ పరిసరాలను మరింత పచ్చగా, ఆహ్లాదకరంగా మార్చవచ్చని జేడీ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు కే. భాస్కరరావు గారు, సెక్రటరీ పి. రవి గారు, గోపి గారు, సత్యం గారు, వీరబాబు గారు, రెడ్డి గారు, మహిళా సభ్యులు మరియు జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.






