బాలికల వసతి గృహంలో సీలింగ్ ఫ్యాన్స్ ఏర్పాటు

07-07-2026: సామాజిక సేవలో భాగంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెందుర్తి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహానికి ఐదు సీలింగ్ ఫ్యాన్స్ అందజేయడం జరిగింది.

హాస్టల్‌లో సీలింగ్ ఫ్యాన్స్ అవసరం ఉందని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ చేసిన విన్నపం మేరకు, జేడీ ఫౌండేషన్ సభ్యులు వెంకట్ గారి చొరవతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీ మృణాళిని పిళ్ళై, శ్రీ భగీరథ్ బోడా, శ్రీమతి శివచందన తదితరుల ఆర్థిక సహకారంతో ఐదు సీలింగ్ ఫ్యాన్స్‌ను హాస్టల్‌కు అందజేశారు.

విద్యార్థినులకు వసతి గృహంలో సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు అవసరమైన సదుపాయాలను అందించడం సామాజిక బాధ్యతలో భాగమని జేడీ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. విద్యార్థినుల అవసరాలను గుర్తించి, సాధ్యమైన మేరకు సహాయం అందించేందుకు ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి సత్యవతి గారు జేడీ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలుగు విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ కే. కృష్ణ గారు మరియు జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader