శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులతో విత్తన బంతుల తయారీ

01-07-2026: పర్యావరణ పరిరక్షణలో భాగంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెందుర్తి పులగాని పాలెం రోడ్డులోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులతో విత్తన బంతుల తయారీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో తురాయి, మహాగణి, కానుగ, మోదుగ, చింత, కుంకుడు, టాబోబియా, సీతాఫలం, సపోటా తదితర దేశీయ విత్తనాలతో విత్తన బంతులను తయారు చేయించడం జరిగింది. ముందుగా విత్తన బంతుల ఆవశ్యకత, పర్యావరణ పరిరక్షణలో వాటి ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించి, అనంతరం విద్యార్థులచే స్వయంగా విత్తన బంతులను తయారు చేయించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెందుర్తి పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీ షేక్ జిలానీ గారు మాట్లాడుతూ, విద్యార్థులు సోషల్ మీడియాలో వచ్చే అనవసరమైన సందేశాలకు స్పందించకుండా, చదువుపై దృష్టి సారించాలని సూచించారు.

స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ తారకేశ్వరరావు గారు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో విత్తన బంతుల ప్రాధాన్యత ఎంతో ఉందని, తమ పాఠశాల విద్యార్థులతో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు.

విద్యార్థులను పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం ద్వారా వారిలో ప్రకృతి పట్ల ప్రేమ, బాధ్యత మరియు పర్యావరణ స్పృహ పెంపొందుతుందని జేడీ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. భవిష్యత్ తరాలకు పచ్చని వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో డీన్ గోవిందరావు గారు, శేషగిరిరావు గారు, ఇతర పాఠశాల సిబ్బంది మరియు జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి, విద్యార్థులతో కలిసి పర్యావరణ పరిరక్షణ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader