గోరపల్లి రైతు వ్యవసాయ క్షేత్రంలో పండ్ల మొక్కలు నాటే కార్యక్రమం

14-07-2026: పర్యావరణ పరిరక్షణలో భాగంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెందుర్తి మండలం గోరపల్లి గ్రామంలోని కే. వెంకట సన్యాసిరావు గారి వ్యవసాయ క్షేత్రంలో పండ్ల జాతి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

జేడీ ఫౌండేషన్ ద్వారా జీవీఎంసీ సమకూర్చిన కొబ్బరి, మామిడి, సపోటా, పనస, నేరేడు తదితర పండ్ల జాతి మొక్కలను వ్యవసాయ క్షేత్రంలో నాటడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు రైతులు తమ వ్యవసాయ భూముల్లో పండ్ల జాతి మొక్కలను పెంచేలా ప్రోత్సహించడం జరిగింది.

ఈ సందర్భంగా రైతు కే. వెంకట సన్యాసిరావు గారు మాట్లాడుతూ, రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా వివిధ రకాల పండ్ల జాతి మొక్కలను పెంచే విధంగా వ్యవసాయ పద్ధతుల్లో వైవిధ్యాన్ని తీసుకురావాలని కోరారు. అలాగే మొక్కలను సమకూర్చడంలో చొరవ చూపిన జేడీ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

పండ్ల జాతి మొక్కలను పెంచడం ద్వారా పర్యావరణానికి మేలు చేయడంతో పాటు, రైతులకు భవిష్యత్తులో అదనపు ఆదాయ వనరులు ఏర్పడే అవకాశం ఉంటుందని జేడీ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. రైతులను పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తూ, వ్యవసాయంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జేడీ గ్రూప్ సభ్యులు మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader