జేడీ ఫౌండేషన్ 7వ వార్షికోత్సవం

10-06-2026: జేడీ ఫౌండేషన్ 7వ వార్షికోత్సవం సందర్భంగా మారుతీనగర్‌లోని మారుతీ హరి హర దేవాలయం ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

జీవీఎంసీ సమకూర్చిన పనస, మహాగణి, మామిడి, సపోటా తదితర మొక్కలను ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో నాటడం జరిగింది. ముందుగా ఆలయ పరిసరాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి, అనంతరం మొక్కలు నాటడం జరిగింది.

పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత మరియు పచ్చదనం పెంపొందించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన మరియు పచ్చని వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలని జేడీ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.

ఆలయ ప్రాంగణంలో నాటిన మొక్కలు భవిష్యత్తులో పెద్దవిగా పెరిగి, ఆలయ పరిసరాలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంతో పాటు ప్రజలకు నీడను, స్వచ్ఛమైన గాలిని అందిస్తాయని తెలిపారు. మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణకు కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నారాయణరావు గారు, సెక్రటరీ వంశీ గారు, ఇతర సంఘ సభ్యులు మరియు జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader