Blogs

ఔత్సాహిక మహిళకు స్వయం ఉపాధి – విజయగాథ

22-05-2026: జె.డి. ఫౌండేషన్ అందించిన సహాయం ఒక మహిళ జీవితాన్ని ఎలా మార్చిందో తెలిపే విజయగాథ ఇది. రెండు సంవత్సరాల క్రితం మంచిర్యాలకు చెందిన ఔత్సాహిక మహిళ శ్రీమతి సంధ్యకు టైలరింగ్ మరియు డిజైనర్ వేర్ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు జె.డి. ఫౌండేషన్ ఆర్థిక సహాయాన్ని అందించింది. ఆ సమయంలో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్, ఐదు కుట్టు మిషన్లతో పాటు మూడు నెలల అద్దెకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా ఫౌండేషన్ అందించింది. ఆ సహాయాన్ని సద్వినియోగం చేసుకున్న …

ఔత్సాహిక మహిళకు స్వయం ఉపాధి – విజయగాథ Read More »

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వందలఏళ్ల నాటి బావిలో పూడిక తీసివేత

19-05-2026: జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “జలమే జీవం” కార్యక్రమంలో భాగంగా, విశాఖపట్నంలోని స్థానిక 89వ వార్డు, యల్లపువానిపాలెం, యల్లపువారి వీధి వద్ద ఉన్న వందల ఏళ్ల నాటి పెద్ద బావిలో పూడిక తొలగింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బావిలో పేరుకుపోయిన ప్లాస్టిక్, గాజు సీసాలు మరియు ఇతర వ్యర్థాలను పని చేసే సిబ్బందితో పాటు స్థానిక ప్రజలు, జేడీ ఫౌండేషన్ సభ్యులు కలిసి తొలగించారు. బావిని శుభ్రపరచడం ద్వారా భూగర్భ జలాల నిల్వ …

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వందలఏళ్ల నాటి బావిలో పూడిక తీసివేత Read More »

మన చెరువు మన బాధ్యత

16-05-2026: పర్యావరణ పరిరక్షణ మరియు నీటి వనరుల సంరక్షణ లక్ష్యంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, శ్రీ నరసింహా యువజన రజక సేవా సంఘం సహకారంతో గోపాలపట్నం హైస్కూల్ గేట్ సమీపంలోని రజక కాలనీ చెరువు వద్ద “మన చెరువు – మన బాధ్యత” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టి, చెరువులో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, గాజు సీసాలు మరియు ఇతర చెత్తను పెద్ద ఎత్తున తొలగించారు. చెరువును పరిశుభ్రంగా ఉంచడం …

మన చెరువు మన బాధ్యత Read More »

ఫౌండర్ శ్రీ జె.డి. లక్ష్మీనారాయణ గారి జన్మదినం సందర్భంగా విద్యార్థిని స్వాతికి ఉచిత ఇంటర్మీడియట్ విద్య

12-05-2026: జె.డి. ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ జె.డి. లక్ష్మీనారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నం వాసవీ జూనియర్ కళాశాల డైరెక్టర్ శ్రీ రమేష్ మాదారపు గారు విద్యార్థిని ఎస్. స్వాతికి హాస్టల్ వసతితో పాటు రెండు సంవత్సరాల పూర్తి ఉచిత ఇంటర్మీడియట్ విద్యను అందించారు. గతంలో పదవ తరగతి చదువుతున్న సమయంలో జె.డి. ఫౌండేషన్ నుంచి సహాయం పొందిన స్వాతి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, ఆమె తల్లి …

ఫౌండర్ శ్రీ జె.డి. లక్ష్మీనారాయణ గారి జన్మదినం సందర్భంగా విద్యార్థిని స్వాతికి ఉచిత ఇంటర్మీడియట్ విద్య Read More »

వంద సంవత్సరాల మామిడి వృక్షానికి సంరక్షణ చర్యలు

07-05-2026: గోపాలపట్నం బాలికొన్నత పాఠశాల ఆవరణలో ఉన్న సుమారు వంద సంవత్సరాల నాటి మామిడి వృక్షాన్ని సంరక్షించేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా, డై బ్యాక్ (Die Back) తెగులు సోకిన ఈ చారిత్రక వృక్షాన్ని కాపాడేందుకు నిపుణుల సూచనల మేరకు సహజసిద్ధమైన పద్ధతులతో దశలవారీగా సంరక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. వృక్షం ఆరోగ్యాన్ని పునరుద్ధరించి భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 02-05-2026: డై బ్యాక్ తెగులు సోకిన శత వయస్సు గల మామిడి వృక్షానికి సంరక్షణ …

వంద సంవత్సరాల మామిడి వృక్షానికి సంరక్షణ చర్యలు Read More »

“జలమే జీవం” పోస్టర్ ఆవిష్కరణ

05-05-2026: విశాఖ మహానగరంలో రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “జలమే జీవం” కార్యక్రమానికి మద్దతుగా నగరవాసుల్లో అవగాహన కల్పించేందుకు జేడీ ఫౌండేషన్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా “వర్షపు నీటిని ఒడిసి పట్టుదాం – ఇంకుడు గుంతలు నిర్మిద్దాం – భూగర్భ జలాలను పెంపొందిద్దాం” అనే సందేశాలతో రూపొందించిన అవగాహన పోస్టర్లను విశాఖ జిల్లా రెవెన్యూ అధికారి మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ ఎం. విశ్వేశ్వర …

“జలమే జీవం” పోస్టర్ ఆవిష్కరణ Read More »

గోపాలపట్నం ఆదిత్య డిగ్రీ కాలేజీలో వాడిన పెన్నుల సేకరణ

02-05-2026: పర్యావరణ పరిరక్షణ మరియు ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణలో భాగంగా, గోపాలపట్నంలోని ఆదిత్య డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన పెన్ డ్రాప్ బాక్స్‌లను ఈ రోజు తెరిచి, విద్యార్థులు ఉపయోగించి పారవేసిన పెన్నులను సేకరించారు. గత నెలలో విద్యార్థుల్లో పర్యావరణ అవగాహన పెంపొందించడం మరియు ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించే లక్ష్యంతో కళాశాల ప్రాంగణంలో ప్రత్యేకంగా పెన్ డ్రాప్ బాక్స్‌లను ఏర్పాటు చేశారు. విద్యార్థులు మంచి స్పందనతో వాటిని వినియోగించి, వాడిన పెన్నులను అందులో వేసి ఈ కార్యక్రమానికి …

గోపాలపట్నం ఆదిత్య డిగ్రీ కాలేజీలో వాడిన పెన్నుల సేకరణ Read More »

విలువలబడిలో విలువలతో కూడిన విద్యను అభ్యసిస్తున్న రేపటి పౌరులు

30-04-2026: జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుర్రాలపాలెంలో నిర్వహిస్తున్న విలువలబడి కార్యక్రమం ద్వారా చిన్నారులకు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారు. విద్యతో పాటు మంచి నడవడి, సామాజిక బాధ్యత, క్రమశిక్షణ మరియు నైతిక విలువలను పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ప్రస్తుత సమాజంలో విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలలోనే కాకుండా వ్యక్తిత్వ వికాసంలో కూడా ముందుండాలని భావిస్తున్న జేడీ ఫౌండేషన్, విలువలబడి ద్వారా పిల్లల్లో సత్ప్రవర్తన, దేశభక్తి, సేవా భావం, పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యత వంటి అంశాలపై …

విలువలబడిలో విలువలతో కూడిన విద్యను అభ్యసిస్తున్న రేపటి పౌరులు Read More »

ఫౌండేషన్ సహాయంతో చదివి పదవ తరగతి పూర్తి చేసిన స్వాతి

29-04-2026: విద్యార్థుల విద్యాభివృద్ధికి అండగా నిలుస్తున్న జేడీ ఫౌండేషన్ సహకారంతో హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరికి చెందిన విద్యార్థిని ఎస్. స్వాతి పదవ తరగతి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి మంచి ఫలితాలు సాధించింది. జేడీ ఫౌండేషన్ సభ్యురాలు శ్రీమతి చావలి అనిత గారు సూచించిన ఈ విద్యార్థినికి గతంలో పదవ తరగతి పెండింగ్ ఫీజుల చెల్లింపునకు ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించబడింది. ఆ సహాయం స్వాతి తన చదువును నిరాటంకంగా కొనసాగించేందుకు ఎంతో ఉపయోగపడింది. ఇటీవల విడుదలైన …

ఫౌండేషన్ సహాయంతో చదివి పదవ తరగతి పూర్తి చేసిన స్వాతి Read More »

ఫౌండేషన్ సభ్యులు తయారు చేసిన వాటర్ డ్రమ్

26-04-2026: వేసవి కాలంలో మొక్కల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ జేడీ ఫౌండేషన్ సభ్యులు వినూత్న చర్యలు చేపడుతున్నారు. గతంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాటిన మొక్కలకు మండు వేసవి ప్రభావం వల్ల నీటి అవసరం పెరగడంతో, వాటికి సులభంగా నీటిని అందించేందుకు ఫౌండేషన్ సభ్యులు ప్రత్యేకంగా వాటర్ డ్రమ్ తయారు చేశారు. ఈ రోజు ఆ వాటర్ డ్రమ్‌ల సహాయంతో వివిధ ప్రాంతాల్లో నాటిన మొక్కలకు నీటిని అందించడం జరిగింది. దీంతో ఒకేసారి ఎక్కువ పరిమాణంలో నీటిని తీసుకెళ్లి …

ఫౌండేషన్ సభ్యులు తయారు చేసిన వాటర్ డ్రమ్ Read More »

loader