Blogs

విద్యార్థులు నాటిన మొక్కలు ఏపుగా పెరుగుతున్న దృశ్యం

19-06-2026: పెందుర్తిలోని చైతన్య స్కూల్ వద్ద జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2023 మరియు 2024 సంవత్సరాల్లో విద్యార్థులు నాటిన మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరిగి పచ్చదనాన్ని అందిస్తున్నాయి. విద్యార్థులు ఎంతో ఆసక్తితో నాటి, సంరక్షించిన ఈ మొక్కలు నేడు పెద్దవిగా పెరగడం పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల సత్ఫలితానికి నిదర్శనంగా నిలుస్తోంది. పాఠశాల ఆవరణలో పచ్చదనం పెరగడంతో విద్యార్థులకు ఆహ్లాదకరమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతోంది. విద్యార్థుల్లో చిన్న వయస్సు నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడంతో పాటు, …

విద్యార్థులు నాటిన మొక్కలు ఏపుగా పెరుగుతున్న దృశ్యం Read More »

ప్రపంచ రక్తదాతల దినోత్సవం

14-06-2026: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జేడీ ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారు 62వ సారి రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు, ప్రమాద బాధితులకు మరియు రక్తం అవసరమైన వారికి సహాయం అందించవచ్చు. ఒక వ్యక్తి చేసే రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడే అవకాశం కల్పిస్తుంది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడంతో పాటు, ఆరోగ్యంగా ఉన్న అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ …

ప్రపంచ రక్తదాతల దినోత్సవం Read More »

పురాతన బావిలో వాన నీటి వడపోత ఏర్పాటు

12-06-2026: జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “జలమే జీవం” కార్యక్రమంలో భాగంగా, గతవారం కంచరపాలెం ధర్మానగర్ వద్ద పూడిక తీసిన పురాతన బావిలోకి వాన నీరు చేరే విధంగా వాన నీటి వడపోత (Rainwater Harvesting) ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటుతో వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడంతో పాటు, భూగర్భ జలాల సంరక్షణకు తోడ్పడేలా చర్యలు తీసుకోవడం జరిగింది.

జేడీ ఫౌండేషన్ 7వ వార్షికోత్సవం

10-06-2026: జేడీ ఫౌండేషన్ 7వ వార్షికోత్సవం సందర్భంగా మారుతీనగర్‌లోని మారుతీ హరి హర దేవాలయం ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జీవీఎంసీ సమకూర్చిన పనస, మహాగణి, మామిడి, సపోటా తదితర మొక్కలను ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో నాటడం జరిగింది. ముందుగా ఆలయ పరిసరాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి, అనంతరం మొక్కలు నాటడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత మరియు పచ్చదనం పెంపొందించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భవిష్యత్ తరాలకు …

జేడీ ఫౌండేషన్ 7వ వార్షికోత్సవం Read More »

ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం

05-06-2026: ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా జేడీ ఫౌండేషన్, విశాఖపట్నం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం మరియు ప్రజల్లో పర్యావరణంపై అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. Y2K పార్క్‌లో మొక్కలు నాటే కార్యక్రమం Y2K Park, చాణుక్య నగర్, సుజాతా నగర్ వద్ద ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పార్క్ ఆవరణలో బాదం, తురాయి, మహాగణి, సపోటా, కదంబం తదితర మొక్కలను నాటడం …

ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం Read More »

పురాతన బావిలో పూడిక తీసివేత

02-06-2026: కంచరపాలెం హైవే ధర్మానగర్ వద్ద జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, స్థానికుల సహకారంతో “జలమే జీవం” కార్యక్రమంలో భాగంగా పురాతన బావిలో పూడికతీత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సుమారు 75 సంవత్సరాల క్రితం గ్రామస్తులందరూ కలిసి తవ్వుకున్న ఈ బావి, పట్టణీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో వాడుకలో లేకపోవడంతో ప్లాస్టిక్ వ్యర్థాలు, పిచ్చి మొక్కలతో నిండిపోయింది. స్థానికుల విన్నపం మేరకు జేడీ ఫౌండేషన్ స్పందించి, స్థానికుల సహకారంతో బావిలోని పూడిక, వ్యర్థాలను తొలగించడం జరిగింది. భవిష్యత్తులో వర్షపు …

పురాతన బావిలో పూడిక తీసివేత Read More »

విలువల బడి

01-06-2026: గత సంవత్సర కాలంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠశాల అనంతరం విలువలతో కూడిన విద్యను అందిస్తూ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులను ఆదర్శవంతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ముఖ్య భూమిక పోషిస్తున్న జేడీ ఫౌండేషన్ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ “విలువల బడి”. విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలకు సంబంధించిన విద్యను అందించడం మాత్రమే కాకుండా, మంచి నడవడి, క్రమశిక్షణ, బాధ్యత, నిజాయితీ, మానవతా విలువలు మరియు సమాజం పట్ల బాధ్యత వంటి అంశాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన …

విలువల బడి Read More »

విత్తనాల సేకరణ

31-05-2026: జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించనున్న విత్తన బంతుల (Seed Balls) కార్యక్రమం కోసం వివిధ రకాల విత్తనాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ, హరితాభివృద్ధి మరియు మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి అవసరమైన విత్తనాలను గ్రూప్ సభ్యులు సేకరించారు. ఈ సందర్భంగా గంగరావి, బాదం, టూబాబియా, ఆముదం తదితర వృక్షాల విత్తనాలను సేకరించి, వాటిని విత్తన బంతుల తయారీకి సిద్ధం చేశారు. వర్షాకాలంలో ఈ విత్తన బంతులను వివిధ ప్రాంతాల్లో …

విత్తనాల సేకరణ Read More »

ఆపరేషన్ క్లీన్ స్వీప్

25-05-2026: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమంలో భాగంగా, జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక 89వ వార్డు ఆదర్శనగర్ ప్రాంతంలో విస్తృత స్థాయి పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ శానిటరీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది మరియు జేడీ గ్రూప్ సభ్యులు కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆదర్శనగర్ పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, గాజు సీసాలు మరియు ఇతర చెత్తను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా …

ఆపరేషన్ క్లీన్ స్వీప్ Read More »

పక్షులకు మట్టి నీటి తొట్టెలు, వరి కంకులు ఏర్పాటు

23-05-2026: వేసవి కాలంలో పక్షుల సంరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా జేడీ ఫౌండేషన్ మరియు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని నేషనల్ హైవే అక్కయ్యపాలెం బస్ స్టాప్ (పోర్టు హాస్పిటల్ ఎదురుగా) నుండి ఎన్‌ఏడీ వరకు ఉన్న పబ్లిక్ పార్కుల్లో పక్షుల కోసం మట్టి నీటి తొట్టెలు ఏర్పాటు చేసి, వరి కంకులను కట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్కులకు విచ్చేసిన సందర్శకులకు వేసవి కాలంలో పక్షుల దాహార్తిని తీర్చేందుకు …

పక్షులకు మట్టి నీటి తొట్టెలు, వరి కంకులు ఏర్పాటు Read More »

loader