29-06-2026: జే.డీ. ఫౌండేషన్ 8వ సంవత్సరం ఏరువాక పౌర్ణమి సందర్భంగా జే.డీ. ఫౌండేషన్ అన్నవరప్పాడు శాఖ, పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లా ఆధ్వర్యంలో, మాజీ సీబీఐ జే.డీ. శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారి సూచనల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం, ఆర్. ఖండ్రిక గ్రామంలో రైతు పూజోత్సవం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా గ్రామంలోని రైతులను సన్మానించి, వారికి నూతన వస్త్రాలు మరియు స్వీట్ బాక్స్‌లను అందజేయడం జరిగింది. వ్యవసాయ రంగంలో రైతుల పాత్రను గుర్తిస్తూ, వారికి గౌరవం కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులు నాగలిని పూజించడం, పశువులకు పూజలు చేయడం వంటి సంప్రదాయాలు మన దేశంలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టే ఈ పండుగ రైతుల జీవన విధానంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలతో కూడా ముడిపడి ఉంది.

ఇలాంటి సంప్రదాయాలను నేటి తరానికి పరిచయం చేయడం, రైతుల కృషికి గుర్తింపు ఇవ్వడం మరియు మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంలో భాగంగా జే.డీ. ఫౌండేషన్ ఈ రైతు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. రైతులను గౌరవించడం ద్వారా వ్యవసాయం మరియు రైతుల ప్రాధాన్యతపై సమాజంలో మరింత అవగాహన కల్పించవచ్చని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జే.డీ. ఫౌండేషన్ అన్నవరప్పాడు శాఖను రైతులు బందెల సుబ్బయ్య, గుద్దటి రాము, కానూరి ఆంజనేయులు, కానూరి తాతారావు, బందెల ఆనంద్ గోపి కృష్ణ, ఆకుల సత్య సాయి బాబా, బందెల ఈశ్వరరావు తదితర గ్రామస్తులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో జే.డీ. ఫౌండేషన్ అన్నవరప్పాడు శాఖ సభ్యులు పొప్పొప్పు కృష్ణమూర్తి, కోటిపల్లి రామకృష్ణ, బోలిశెట్టి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


