Environment Activities

మొక్కలకు నీటి సంరక్షణ ఏర్పాటు

17-04-2026: వేసవి కాలంలో మొక్కల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ జేడీ ఫౌండేషన్ సభ్యులు స్థానిక చంద్రానగర్ సబ్-వే ప్రాంతంలో నాటిన మొక్కలకు నీరు అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. వేసవి తీవ్రత కారణంగా మొక్కలు ఎండిపోకుండా, ఆరోగ్యంగా పెరిగేలా వాటికి క్రమం తప్పకుండా నీరు అందించడం ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు మొక్కల సంరక్షణ చర్యల్లో భాగంగా వాటికి నీరు పోసి పరిరక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా, అవి …

మొక్కలకు నీటి సంరక్షణ ఏర్పాటు Read More »

ఆంధ్రా యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీలో వాడిన పెన్ డ్రాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసిన జేడీ ఫౌండేషన్

16-04-2026: పర్యావరణ పరిరక్షణ మరియు ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ లక్ష్యంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రా యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీలో పెన్ డ్రాప్ బాక్స్‌లు ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు మరియు పరిశోధకులు అధికంగా వినియోగించే లైబ్రరీ ప్రాంగణంలో వాడిన పెన్నులను బహిరంగ ప్రదేశాల్లో పడవేయకుండా, వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌లలో వేయాలని అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం లైబ్రేరియన్ ప్రొఫెసర్ ఆచార్య సి.హెచ్. శ్రీనివాసరావు గారి సమక్షంలో …

ఆంధ్రా యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీలో వాడిన పెన్ డ్రాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసిన జేడీ ఫౌండేషన్ Read More »

స్వచ్ భారత్ మరియు జలమే జీవం కార్యక్రమం

12-04-2026: పర్యావరణ పరిరక్షణ మరియు భూగర్భ జలాల పెంపుదల లక్ష్యంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ భారత్ మరియు “జలమే జీవం” కార్యక్రమం నిర్వహించబడింది. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ మరియు జేడీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారి సూచనల మేరకు, గోపాలపట్నం – సింహాచలం రోడ్డులో పవన్ రెసిడెన్సీస్ ఎదురుగా ఉన్న కొండ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మొదటగా ఆ ప్రాంతంలో స్వచ్ భారత్ కార్యక్రమం నిర్వహించి, కొండ మరియు రక్షణ …

స్వచ్ భారత్ మరియు జలమే జీవం కార్యక్రమం Read More »

ఆదిత్య డిగ్రీ కాలేజీకి పెన్ డ్రాప్ బాక్స్‌లు అందజేసిన జేడీ ఫౌండేషన్

09-04-2026: పర్యావరణ పరిరక్షణలో భాగంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “Stop Landfill – Drop Used Pens Here” కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గోపాలపట్నంలోని ఆదిత్య డిగ్రీ కాలేజీకి పెన్ డ్రాప్ బాక్స్‌లు అందజేయడం జరిగింది. వాడేసిన పెన్నులను నిర్లక్ష్యంగా బహిరంగ ప్రదేశాలలో పడవేయడం వల్ల పర్యావరణానికి హాని కలిగే అవకాశం ఉంది. ప్లాస్టిక్‌తో తయారయ్యే ఈ పెన్నులు సహజంగా కరగకపోవడంతో భూమి కాలుష్యానికి కారణమవుతాయి. ఈ సమస్యకు పరిష్కారంగా జేడీ ఫౌండేషన్ ప్రత్యేకంగా …

ఆదిత్య డిగ్రీ కాలేజీకి పెన్ డ్రాప్ బాక్స్‌లు అందజేసిన జేడీ ఫౌండేషన్ Read More »

జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం కన్వీనర్ శ్రీ రామకృష్ణ గారి గృహం దర్శించిన జీవీఎంసీ అధికారులు

07-04-2026: ఈ రోజు 89వ వార్డు పర్యటనలో భాగంగా జీవీఎంసీ అధికారులు జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం కన్వీనర్ శ్రీ రామకృష్ణ గారి స్వగృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను అధికారులు పరిశీలించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ శ్రీ నల్లనయ్య గారు, ఏఎంహెచ్‌ఓ శ్రీ కృష్ణంరాజు గారు, వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎం. రామకృష్ణ గారు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. …

జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం కన్వీనర్ శ్రీ రామకృష్ణ గారి గృహం దర్శించిన జీవీఎంసీ అధికారులు Read More »

శబల కార్యక్రమంలో పాల్గొన్న జేడీ గ్రూప్ సభ్యులు

01-04-2026 నుండి 05-04-2026 వరకు విశాఖపట్నంలోని సింహాచలం దేవస్థానం గోశాల, కృష్ణాపురంలో ఏప్రిల్ 1 నుండి 5 వరకు నిర్వహించిన శబల భోజన పండుగలు (గో ఆధారిత సాంప్రదాయ సహజ ఆహార మహోత్సవం) కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు ఐదు రోజుల పాటు పూర్తిస్థాయిలో పాల్గొని సేవలు అందించారు. పర్యావరణ హితం, సహజ వ్యవసాయం, గో ఆధారిత జీవన విధానం మరియు సాంప్రదాయ ఆహార సంస్కృతిని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన ఈ మహోత్సవం విశాఖపట్నం ప్రజలను విశేషంగా …

శబల కార్యక్రమంలో పాల్గొన్న జేడీ గ్రూప్ సభ్యులు Read More »

దివ్యాంగుల పాఠశాలలో అన్నదానం

24-02-2026, భద్రాచలం: స్థానిక శాంతినగర్‌లోని దివ్యాంగుల పాఠశాలలో జేడీ ఫౌండేషన్ అధినేత శ్రీ వి. వి. లక్ష్మీనారాయణ గారు మరియు శ్రీమతి ఊర్మిళ గారి వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు కంభంపాటి సురేష్ గారు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులకు అన్నదానం నిర్వహించడం విశేషం. విద్యార్థులతో …

దివ్యాంగుల పాఠశాలలో అన్నదానం Read More »

ప్లాస్టిక్ పెట్ బాటిల్స్ తో ట్రీ గార్డ్ తయారు

21-02-2026: జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినూత్న కార్యక్రమంగా వాడేసిన ప్లాస్టిక్ పెట్ బాటిల్స్‌తో ట్రీ గార్డును తయారు చేసి, గతంలో నాటిన మొక్కకు ఏర్పాటు చేయడం జరిగింది. జేడీ ఫౌండేషన్ గతంలో నాటిన వందలాది మొక్కల సంరక్షణ బాధ్యతను తీసుకుని, వాటి అభివృద్ధికి కృషి చేస్తోంది. ఈ క్రమంలో ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగం చేస్తూ, మొక్కలను రక్షించే విధంగా ట్రీ గార్డులను రూపొందించడం ప్రత్యేకతగా నిలిచింది. మొక్కల సంరక్షణ కోసం జీవీఎంసీ వారు …

ప్లాస్టిక్ పెట్ బాటిల్స్ తో ట్రీ గార్డ్ తయారు Read More »

మొక్కలకు నీటి సంరక్షణ ఏర్పాటు

17-02-2026: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక గోపాలపట్నం BRTS రోడ్డు మార్గం మధ్యలో నాటిన మొక్కలకు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక నీటి సంరక్షణ ఏర్పాట్లు చేయడం జరిగింది. మొక్కలు వేసిన తర్వాత వాటి సంరక్షణ అత్యంత ముఖ్యమని భావించిన ఫౌండేషన్ సభ్యులు, నీటి వృథాను తగ్గిస్తూ మొక్కలకు అవసరమైనంత నీరు చేరేలా ఒక సులభమైన పద్ధతిని అమలు చేశారు. వాడేసిన ప్లాస్టిక్ బాటిల్స్‌ను కట్ చేసి భూమిలో అమర్చి, వాటి ద్వారా నీరు నెమ్మదిగా …

మొక్కలకు నీటి సంరక్షణ ఏర్పాటు Read More »

పొలంబడి పంట

09-02-2026: గత ఏడాది నవంబర్ నెలలో కే. కోటపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పొలంబడి కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోంది. ఆ సమయంలో విద్యార్థులతో కలిసి నాటిన కూరగాయ మొక్కలు ఇప్పుడు పుష్కలంగా పెరిగి మంచి దిగుబడిని ఇస్తున్నాయి. ఈ పంటలు విద్యార్థుల కృషి, పట్టుదల మరియు సరైన సంరక్షణకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పొలంబడి కార్యక్రమం ద్వారా విద్యార్థులకు వ్యవసాయం పట్ల అవగాహన కల్పించడమే కాకుండా, మొక్కలను ఎలా నాటాలి, …

పొలంబడి పంట Read More »

loader