Environment Activities

మిoది గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వాడేసిన పెన్నుల సేకరణ

07-02-2026: మిoది గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెన్ డ్రాప్ బాక్స్‌లు నిండడంతో ఈ రోజు వాటిని తెరిచి అందులో ఉన్న వాడేసిన ప్లాస్టిక్ పెన్నులను సేకరించడం జరిగింది. పాఠశాలలో విద్యార్థులు డ్రాప్ బాక్స్‌లను చురుకుగా వినియోగించడం వల్ల తక్కువ సమయంలోనే అవి నిండడం ఈ కార్యక్రమం విజయాన్ని సూచిస్తోంది. వాడిన పెన్నులను ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా ఒకేచోట సేకరించడం ద్వారా పాఠశాల పరిసరాలు మరింత …

మిoది గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వాడేసిన పెన్నుల సేకరణ Read More »

పాఠశాలల్లో పెన్ డ్రాప్ బాక్స్‌ల ఏర్పాటు కార్యక్రమాలు

02-02-2026: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించేందుకు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో “Stop Landfill Drop Used Pens Here” కార్యక్రమాన్ని విశాఖ మహానగరంలోని పలు పాఠశాలల్లో నిర్వహించడం జరిగింది. రోజువారీగా వాడుతున్న ప్లాస్టిక్ పెన్నులు భూమిలో కరగక పర్యావరణానికి తీవ్రమైన హాని కలిగిస్తున్న నేపథ్యంలో, వాటిని ఒకేచోట సేకరించేలా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే పర్యావరణంపై బాధ్యతా భావం పెంపొందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. 02-02-2026: కేంద్రీయ విద్యాలయం, …

పాఠశాలల్లో పెన్ డ్రాప్ బాక్స్‌ల ఏర్పాటు కార్యక్రమాలు Read More »

వెంకటాపురం పాఠశాలలో పొలంబడి కార్యక్రమం

01-02-2026: పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యార్థుల్లో వ్యవసాయం పట్ల ఆసక్తి పెంపొందించేందుకు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆనందపురం మండలం, వెంకటాపురం గ్రామంలోని మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో పొలంబడి కార్యక్రమం నిర్వహించబడింది. 01-02-2026: నేల సిద్ధం ఈ కార్యక్రమానికి భాగంగా మొదటి రోజు విద్యార్థులు పొలంబడి కార్యక్రమానికి అవసరమైన నేలను సిద్ధం చేశారు. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు భూమిని శుభ్రపరచి, మొక్కలు నాటేందుకు అనువుగా తయారు చేయడం జరిగింది. ఈ దశలో విద్యార్థులకు వ్యవసాయం ప్రాధాన్యత, …

వెంకటాపురం పాఠశాలలో పొలంబడి కార్యక్రమం Read More »

జిల్లా పరిషత్ ఉన్నత (బాలికల) పాఠశాలలో విద్యార్థినులతో “పొలంబడి” కార్యక్రమం

24-01-2026: జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణతో పాటు జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని గోపాలపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికల)లో విద్యార్థినులతో కలిసి పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులతో వంకాయ, టమాటో, కాలిఫ్లవర్, మిరప తదితర కూరగాయ మొక్కలు, తోటకూర, పాలకూర వంటి ఆకుకూరల విత్తనాలు, అలాగే దొండ, చిక్కుడు, పాదులు, మునగ వంటి మొక్కలను నాటించడం జరిగింది. ముందుగా మొక్కల ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్ర, …

జిల్లా పరిషత్ ఉన్నత (బాలికల) పాఠశాలలో విద్యార్థినులతో “పొలంబడి” కార్యక్రమం Read More »

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాడేసిన పెన్నుల సేకరణ కార్యక్రమాలు

21-01-2026: పర్యావరణ పరిరక్షణలో భాగంగా జేడీ ఫౌండేషన్ వివిధ పాఠశాలల్లో యూజ్డ్ పెన్ డ్రాప్ బాక్స్‌లను ఏర్పాటు చేసి వాడేసిన పెన్నుల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. జనవరి నెలలో నిర్వహించిన రెండు ముఖ్య కార్యక్రమాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. 21-01-2026: కొత్తపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్థానిక కొత్తపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 25 రోజుల క్రితం ఏర్పాటు చేసిన పెన్ డ్రాప్ బాక్స్‌లలో విద్యార్థులు బాధ్యతగా వాడేసిన పెన్నులను …

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాడేసిన పెన్నుల సేకరణ కార్యక్రమాలు Read More »

మల్కాపురం పి.ఎం. శ్రీ కేంద్రీయ విద్యాలయంలో పొలంబడి

07-01-2026: మల్కాపురం పి.ఎం. శ్రీ కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థుల భాగస్వామ్యంతో చేపట్టిన పొలంబడి కార్యక్రమం ప్రగతిపథంలో కొనసాగుతోంది. నవంబర్ 2025లో మున్నా గ్రూప్ సభ్యులు మరియు పాఠశాల లైబ్రేరియన్ శ్రీ జగన్ మోహన్ గారి సమన్వయంతో జేడీ ఫౌండేషన్ నుండి వంకాయ, టమాటో, క్యాబేజీ, కాలిఫ్లవర్ తదితర కూరగాయల నారును తీసుకుని పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులతో కలిసి నాటడం జరిగింది. ఈ రోజు ఆ మొక్కలను విద్యార్థులు ప్రేమతో సంరక్షిస్తూ ఉన్న దృశ్యాలు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. …

మల్కాపురం పి.ఎం. శ్రీ కేంద్రీయ విద్యాలయంలో పొలంబడి Read More »

పాఠశాలల్లో వాడిన పెన్నుల కలెక్షన్ బాక్సులు ఏర్పాటు

04-01-2026: రోజురోజుకు పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించే లక్ష్యంతో జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం నూతన సంవత్సరంలో ఒక చిన్న కానీ ప్రభావవంతమైన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. పాఠశాలలు మరియు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రతిరోజూ వాడిన పెన్నులను నిర్లక్ష్యంగా బహిరంగ ప్రదేశాల్లో పడవేయడం వల్ల ప్లాస్టిక్ వ్యర్థాలు పెరుగుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రతి పాఠశాలలో ప్రత్యేకంగా ఒక కలెక్షన్ బాక్స్ ఏర్పాటు చేసి, వాడిన పెన్నులను అందులో వేయించే విధంగా అవగాహన కల్పించనున్నారు. ఈ విధంగా …

పాఠశాలల్లో వాడిన పెన్నుల కలెక్షన్ బాక్సులు ఏర్పాటు Read More »

ఇంకుడు గుంతల నిర్మాణం

29-12-2025: జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక వెంకటాపురంలో నిర్మాణంలో ఉన్న ఇండ్ల వద్ద నిర్మిస్తున్న ఇంకుడు గుంతలను గ్రూప్ సభ్యులు సందర్శించి పరిశీలించారు. శ్రీ కుమారి క్యాటరింగ్ అధినేత శ్రీ ధవళ మోహన్ గారు మరియు వారి ముగ్గురు అన్నదమ్ములు నిర్మిస్తున్న ఇండ్ల వద్ద ఫౌండేషన్ సూచన మేరకు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టడం అభినందనీయమైన విషయం. విశాఖ మహానగరంలో భూగర్భ జలాలు క్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో వర్షపు నీటిని భూమిలోకి చొరబాటుచేసే విధంగా ఇంకుడు గుంతలు …

ఇంకుడు గుంతల నిర్మాణం Read More »

విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ కాలేజ్ ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులతో స్వచ్ భారత్ నిర్వహణ మరియు ఏక్ దిన్ ఏక్ సాత్ ఏక్ బ్యాగ్ కార్యక్రమం

16-12-2025: జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం సహకారంతో “ఏక్ దిన్ – ఏక్ సాత్ – ఏక్ బ్యాగ్” కార్యక్రమం మరియు స్వచ్ భారత్ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విశాఖ నగరంలోని మొత్తం 32 ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గోపాలపట్నం, సుజాతనగర్, పెందుర్తి, నరవ, శ్రీహరిపురం, గాజువాక, కంచరపాలెం, మర్రిపాలెం, మురళీ నగర్, యల్లపువానిపాలెం, కొత్తపాలెం, చంద్రానగర్, లక్ష్మీ నగర్, నాయుడుతోట, ఆంధ్రా యూనివర్శిటీ ఏ ఐ హబ్, …

విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ కాలేజ్ ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులతో స్వచ్ భారత్ నిర్వహణ మరియు ఏక్ దిన్ ఏక్ సాత్ ఏక్ బ్యాగ్ కార్యక్రమం Read More »

ఏక్ దిన్ ఏక్ సాత్ ఏక్ బ్యాగ్ కార్యక్రమం

14-12-2025: జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం సహకారంతో “ఏక్ దిన్ – ఏక్ సాత్ – ఏక్ బ్యాగ్” కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని విశాఖ నగరంలోని మొత్తం 32 ప్రాంతాలలో చేపట్టారు. గోపాలపట్నం, సుజాతనగర్, పెందుర్తి, నరవ, శ్రీహరిపురం, గాజువాక, కంచరపాలెం, మర్రిపాలెం, మురళీ నగర్, యల్లపువానిపాలెం, కొత్తపాలెం, చంద్రానగర్, లక్ష్మీ నగర్, నాయుడుతోట, ఆంధ్రా యూనివర్శిటీ ఏ ఐ హబ్, మల్కాపురం తదితర ప్రాంతాలలో ఫౌండేషన్ …

ఏక్ దిన్ ఏక్ సాత్ ఏక్ బ్యాగ్ కార్యక్రమం Read More »

loader