Environment Activities

విశాఖపట్నం ధర్మానగర్‌లో – “స్టీల్ ప్లేట్ తెచ్చుకో వస్త్ర సంచి తీసుకో” కార్యక్రమానికి విశేష స్పందన

01-09-2025న జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా, కోరమాండల్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం వారు సమకూర్చిన వస్త్ర సంచులను పంపిణీ చేసే కార్యక్రమం ధర్మానగర్, కంచరపాలెం విన్నింగ్ గయ్స్ టీమ్ వద్ద జరిగిన అన్నసంతర్పణ కార్యక్రమం సందర్భంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భక్తులు ఇంటి నుంచి స్టీల్ కంచం తెచ్చుకుని భోజనానికి విచ్చేయగా, ఫౌండేషన్ వారు వారికి వస్త్ర సంచులు అందజేశారు. ఈ పర్యావరణ స్నేహపూర్వక కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. …

విశాఖపట్నం ధర్మానగర్‌లో – “స్టీల్ ప్లేట్ తెచ్చుకో వస్త్ర సంచి తీసుకో” కార్యక్రమానికి విశేష స్పందన Read More »

విశాఖపట్నం గోపాలపట్నం రైతు బజార్ లో చేతి సంచులు పంపిణీ

28-09-2025న జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, శ్రీ కుమారి క్యాటరింగ్ ఆర్థిక సాయంతో, గోపాలపట్నం రైతు బజార్ లోపల పర్యావరణ హితమైన చేతి సంచులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవీఎంసీ కో ఆప్షన్ సభ్యులు శ్రీ బెహరా భాస్కరరావు గారు విచ్చేసి, ప్రజలందరూ పర్యావరణ హితమైన అలవాట్లను అలవర్చుకుని, పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లిస్తున్న ప్లాస్టిక్ సంచులను విడనాడాలని సూచించారు. ప్రతి సంవత్సరం శ్రీ కుమారి క్యాటరింగ్ అధినేత శ్రీ దవళ మోహన్ గారు …

విశాఖపట్నం గోపాలపట్నం రైతు బజార్ లో చేతి సంచులు పంపిణీ Read More »

విశాఖపట్నంలో “స్వచ్ఛ సాగర్ – సురక్షిత సాగర్” కార్యక్రమం

17-09-2025న ప్రపంచ తీరప్రాంత పరిశుభ్రత దినోత్సవ వారోత్సవాల సందర్భంగా, “స్వచ్ఛ సాగర్ – సురక్షిత సాగర్” పేరుతో విశాఖపట్నంలో బీచ్ క్లీనప్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం సిటీ లా సన్స్ బే కొలనీ ఎదురుగా ఉన్న పెద్ద జాలారిపేట వద్ద జరిగింది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వివిధ కళాశాలల విద్యార్థులు, ఎన్‌జి‌ఓలు, మరియు మత్యకార సాధికార సమితి సభ్యులు పాల్గొన్నారు. జేడీ ఫౌండేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో భాగమై, తీరప్రాంతంలో పేరుకుపోయిన …

విశాఖపట్నంలో “స్వచ్ఛ సాగర్ – సురక్షిత సాగర్” కార్యక్రమం Read More »

విశాఖపట్నంలో – ఏక్ దిన్ ఏక్ సాత్ ఏక్ గంట – స్వచ్ఛతా హి సేవా – స్వచ్ఛోత్సవం కార్యక్రమం

25-09-2025న, 94వ వార్డు, వేపగుంట జీవీఎంసీ జోనల్ కమిషనర్ ఆఫీసు ప్రక్కన ఉన్న గంగి రెడ్డ్ల కాలనీ వద్ద “ఏక్ దిన్ ఏక్ సాత్ ఏక్ గంట – స్వచ్ఛతా హి సేవా – స్వచ్ఛోత్సవం” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. జీవీఎంసీ ఆహ్వానం మేరకు జేడీ ఫౌండేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జీవీఎంసీ ఇన్‌చార్జ్ జోనల్ కమిషనర్ శ్రీ శంకరరావు గారు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుడి …

విశాఖపట్నంలో – ఏక్ దిన్ ఏక్ సాత్ ఏక్ గంట – స్వచ్ఛతా హి సేవా – స్వచ్ఛోత్సవం కార్యక్రమం Read More »

తీర్థ యాత్రలో విత్తన బంతులను విసిరిన జేడీ ఫౌండేషన్ సభ్యులు

జేడీ ఫౌండేషన్ సభ్యులు తమ తీర్థ యాత్రలో పర్యావరణ పరిరక్షణ పట్ల తమ ప్రేమను మరోసారి చూపించారు. తీర్థ యాత్ర తిరుగు ప్రయాణంలో చిల్క సరస్సు దగ్గరలోని అటవీ ప్రాంతంలో విత్తన బంతులను విసరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు కృష్ణమూర్తి గారు, శ్రీనివాస్ గారు, వెంకటరావు గారు, సాంబ గారు తదితరులు పాల్గొన్నారు.స్థానికులతో కలిసి పూరీ, కోణార్క్ వంటి పవిత్ర ప్రాంతాలకు బస్సులో తీర్థ యాత్రకు వెళ్లిన సందర్భంగా, ప్రకృతి సంరక్షణలో భాగంగా …

తీర్థ యాత్రలో విత్తన బంతులను విసిరిన జేడీ ఫౌండేషన్ సభ్యులు Read More »

విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో మొక్కలు నాటే కార్యక్రమం

20-09-2025న జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెలా మూడవ శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “స్వచ్ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా” కార్యక్రమం సందర్భంలో, ఆంధ్రా విశ్వకళా పరిషత్ స్వర్ణోత్సవాల నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా, జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఆంధ్రా యూనివర్సిటీ డా. వి. ఎస్. కృష్ణ లైబ్రెరీ ప్రాంగణంలో, ప్రధాని నరేంద్ర మోడి గారి “మన్ కి బాత్” కార్యక్రమం పిలుపు మేరకు, మియావాకీ పద్ధతిలో అర్బన్ …

విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో మొక్కలు నాటే కార్యక్రమం Read More »

విశాఖపట్నంలో వివిధ ప్రాంతాలలో మొక్కలు నాటే కార్యక్రమం

07-09-2025: ఈ రోజు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా, సీబీఐ మాజీ జేడీ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారి సూచనల మేరకు, విశాఖపట్నం 89వ వార్డు సంతోష్ నగర్, వెంకటాపురం రోడ్, జి.ఎస్.ఎస్ టవర్స్, అమ్మా రెసిడెన్సీ, భగత్ సింగ్ నగర్ వంటి ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టబడింది. జీవీఎంసీ జోన్-8 వారు సమకూర్చిన వేప, తురాయి, బాదం, బోగడ, టొబాబియా, కదంభం వంటి మొక్కలను నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య …

విశాఖపట్నంలో వివిధ ప్రాంతాలలో మొక్కలు నాటే కార్యక్రమం Read More »

విశాఖపట్నంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఏడాది నిర్వహించబడే మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా విశాఖపట్నంలో ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జేడీ ఫౌండేషన్ మరియు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించాయి. “మట్టి గణపతినే పూజిద్దాం — పర్యావరణాన్ని కాపాడుదాం” అనే నినాదంతో, గోపాలపట్నం పిన్నమనేని ఫంక్షన్ హాల్ వద్ద భక్తులకు విత్తన మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంలో విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ …

విశాఖపట్నంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ Read More »

మూడు సంవత్సరముల క్రితం వేసిన తాటి టెంకలు నుంచి 3–4 అడుగుల ఎత్తు పెరిగిన తాడి చెట్లు

30-08-2025 న: జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, సెప్టెంబర్ 2022 లో విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ హాస్టల్ విద్యార్థులతో కలిసి పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఆ కార్యక్రమంలో, మానవాళికి ఎన్నో విధాలుగా ఉపయోగపడే, కానీ నగరీకరణ కారణంగా అంతరించి పోతున్న తాడి చెట్లను సంరక్షించాలనే సంకల్పంతో, దగ్గరలో ఉన్న కొండపై తాటి టెంకలు నాటడం జరిగింది. మూడు సంవత్సరాల తరువాత, ఈ రోజు ఆ టెంకలు సుమారు మూడు …

మూడు సంవత్సరముల క్రితం వేసిన తాటి టెంకలు నుంచి 3–4 అడుగుల ఎత్తు పెరిగిన తాడి చెట్లు Read More »

5000 విత్తన బంతులను జీవీఎంసీ హార్టీకల్చర్ సిబ్బందికి అందజేసిన జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం

పర్యావరణ పరిరక్షణలో భాగంగా, జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం నగరంలో మరో అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. 2025 ఆగస్టు 2న, జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోపాలపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాయ్స్ & గర్ల్స్) విద్యార్థిని విద్యార్థులతో సుమారు 5000 (ఐదు వేల) విత్తన బంతులు తయారు చేయించి, వాటిని జీవీఎంసీ హార్టికల్చర్ విభాగానికి చెందిన పల్లవి గారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ శ్రీమతి కారుముడి అను గారు, ఫౌండేషన్ సభ్యులు, …

5000 విత్తన బంతులను జీవీఎంసీ హార్టీకల్చర్ సిబ్బందికి అందజేసిన జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం Read More »

loader