జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఆరు సంవత్సరాల క్రితం స్థానిక కొత్తపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో వేసిన మొక్కలు
ఆరు సంవత్సరాల క్రితం జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో కొత్తపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా పలు మొక్కలు నాటడం జరిగింది. ఆ సమయంలో నాటిన చిన్న మొక్కలు ఇప్పుడు పెద్ద చెట్లుగా మారి, పాఠశాలకు సహజమైన పచ్చదనం మరియు ప్రశాంతతను అందిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చెట్లు ఇచ్చే నీడలో విద్యార్థిని–విద్యార్థులు పాఠశాల ప్రార్థన చేయడం ఎంతో స్ఫూర్తిదాయక దృశ్యం. ఇది మొక్కలు నాటటం ఎంత ముఖ్యమో మాత్రమే కాకుండా, వాటిని …









